Thursday, February 18, 2010

తెలుగు మీద చిన్న చిన్న ఆలోచనలు

నా సంగతి. నాకు భాషలను గురించి పెద్దగా తెలియదు; నలుగురితితో మాట్లాడుకోటానికి, నాకు అవసరమయినవి రాసులోటానికీ, ఏరాయి ఐతే ఏమి అన్నట్లుగా ఉంటూ ఉండేవాడిని. చేసేది లెక్కలు కాబట్టి ఆంగ్లమే ఎక్కువ అలవాటయ్యింది. కాని చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాము. వయస్సు ఎక్కువైన తరువాత ఉన్నట్లుండి చిన్నప్పుడు విన్న తెలుగు పాటలు గుర్తుకు రావటం మొదలు పెత్తయి. ఇవి ఎక్కువగా తెలుగుపదాలు ఉన్న పాటలు (ఆరుద్ర, మల్లాది సినిమా పాటలు, వేమన, కొన్ని చిన్న పిల్లల పాటలు, జానపద గేయాలు..). ఛిన్నఫ్ఫుడు బట్టీపట్టిన పద్యాలు కూడా కొన్ని గుర్తుకుకు వచ్చినయ్యి; మను చరిత్రలో 'అటజని కాంచె భూమీసురుడు..'. కాని తరువాత అంతా సంస్క్రుతంలో ఉంది. అర్థం కాదు. కొన్ని అన్నమాచార్యులు పదాలు, శ్రీనాధుడి చాటు పద్యాలు తేలికగా ఉన్నయ్యి కాని మిగతా క్లాసిక్స్ చాలా వరకు సంస్క్రుత మయం. అర్థం కావు. శ్రీశ్రీ కూడా కొన్ని పద్యాల్లో శబ్దాలు వింటానికి బాగుంటయ్యి కాని అర్థం కావు. విశ్వనాథ చెప్పవసరం లేదు (చెలియలికట్ట లాంటివి తప్పిస్తే). ఈమధ్య ఒక మాదిగ పాతల పుస్తకం చదివితే మళ్ళి బాగానే అర్థమయింది.ఎక్కడో ప్రజలు మట్లాడే భాషకూ పేరున్న రచయతలు రాసే భాషకు తేడాలు వచ్చినట్లున్నాయ్యి.

నా సంగతి వదిలేయండి. కొంతమంది తాము మాములుగా వాడే పదాలకి తెలుగు మాటలు ఏమిటా అని 'తెలుగుపదం' అనే సైటులో ప్రయత్నిస్తున్నారు. వీళ్లు బాగా చదువుకున్నవాళ్ళు తెలుగుకి సంబధించని ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు. మరి ఎందుకో తెలుగుమీద ప్రేమ ఉన్నామని చెప్పేవాళ్ళు చాలామంది అలాంటి సైట్లు జోలికి రారు. ఈతెలియని వాళ్ళతో చర్చలు చేస్తే కాలం పాడు ఔతందనేమో ?

ఈచదువుకున్న ఎలైట్ల మాట వదిలేసి, మాములు రైతులు కూలీల విషయం ఆలోచించండి. ప్రొద్దుటినుంచీ బ్యాంకులు, ఆఫీసులు, కోర్టులు, అప్ప్లికేషనులు, ఫోనులు అన్నిట్లో కొద్దో గొప్పో ఆంగ్లం కావాలిసి వస్తుంది. ప్రభుత్వం ఏమి చేయపొతూందో తెలిసుకోవాలంటే పేపర్లు చూడాలి. ఇందులో చాలా పదాలు ఆంగ్లంలో ఉంటాయి. బూదరాజు రాధా క్రిష్నలాంటి వారు కష్టపడి కొంతవరకు పదాలు సేకరించారు. కాని అంత త్రుప్తికరంగాలేవు. తరువాత కొన్ని బ్లాగులొలోనే (తెలుగుపదం, తెలుగుథీసిస్, తాడేపల్లి వగైరా) ప్రయత్నాలు కనపడుతున్నవి. ఇంతకీ చెప్పొచిందేంటటే ప్రజలు రోజూ మాట్లడే, అవసరమైన భాషకూ, రచయితల భాషకూ విచ్చేదనము ఉంది. కొంతవరకూ బ్లాగులు వంతెనలాగ ఉపయోపడుతున్నవి. పండితులేమి చేస్తున్నారో నాకు తెలియదు.

పూర్వకాలంలో పరిస్తితులు ఎలా ఉండేవో? నన్నయకు పుర్వం లీలగా కుర్క్యాల శాసనాలవల్ల తెలుస్తున్నవి. తరువాత రాయలనాటి వైభవం, నాయకులనాటి సంగతులు విన్నాము. రాజుల ఆదరణ లేక భాష వ్రుద్ధి కాలేంటారు. కాని ప్రజలు ఏదొ ఒక రకం తెలుగు మాట్లాడూనే ఉన్నారు. అది చాలాబాగుందని విదేశీయులు నిఘంటువులు వగైరా రాయటం మొదలెట్టారు. ఉర్దూ, ఆంగ్లం లాంటి భాషలనుంచి చాల మాటలు తెలుగులోకి వచ్చాయి. నేననుకోటం అందరకూ ఇతర భాషలు పూర్తిగా నేర్చుకొవటం కష్టం. కాని కొంచెం కొంచెం మారుతూ తెలుగు నిలుస్తూనే ఉంది. గోరాటి వెంకన్న లాంటివారు వస్తూనే ఉంటారు. తెలుగు ఎలాగోలా కొనసాగుతూనే ఉంటుంది.

5 comments:

baluma77 said...

మంచి ప్రయత్నం మీరు ఇలా మొదలు పెట్టడం కూడా చాల మంచిది తప్పులు దిడు కోవదనికే
కానివ్వండి ఇట్లు భవదీయుడు
పెరుగు బాలసుబ్రమణ్యం

gaddeswarup said...

బాలసుబ్రమణ్యం గారూ,
నెనర్లు. ఎవరైనా తప్పులు సవరించి కొన్నిమాటలు ఎలరాయాలో చెప్పుతారని చూస్తున్నా.

కామేశ్వరరావు said...

స్వరూప్ గారూ,

వట్రసుడి - "ఋ" గుణింతం రాయడానికి సాధారణంగా ఇంగ్లీషు లిపిలో "R (capital R)" వాడితే సరిపోతుంది. ఉదాహరణకి "తృప్తి" ఇంగ్లీషు లిపిలో tRpti అని రాయాలి.
మరొకటి "ణ". దీనికి "N (capital N)" రాయాలి. "కృష్ణ" ఇంగ్లీషు లిపిలో "kRshNa" అవుతుంది.

మీరు వాడే transliteration tool బట్టి ఇందులో తేడా ఉండవచ్చు. లేఖినిలో అయితే ఇవే.

gaddeswarup said...

కామేశ్వరరావు గారూ,
నెనర్లు.
సంస్కృతం కూడా తప్పు రాసినట్లున్నాను. చాప (for mat) ఎలా రాస్తారు?
నేను లేఖినే వాడుతున్నాను; అది చూడగానే తేలికగా వాడవచ్చనిపించింది.
స్వరూప్
P.S. Perhaps, I can ask you once in a while about such things.

blus sky said...

I like your blog, jeremy lin jersey sale content is very exciting.Can learn a lot from the inside, brazilian bikini and see many want to see, thank you very much to share .louis vuitton speedy.